శవరాజకీయాలు మంచిది కాదు.. ఇకనైనా మానుకోండి: మంత్రి సవిత వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-22 08:48:10  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...

శవరాజకీయాలు మంచిది కాదు.. ఇకనైనా మానుకోండి: మంత్రి సవిత వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై మంత్రి సవిత(Minister Savitha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు కేవలం దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని, ఆయన ఇకనైనా తన "సైకో" ఆలోచనలను మానేయాలని హితవు పలికారు. వైసీపీ(Ycp) గుర్తు ఫ్యాన్ కాదని, అది నరకడానికే పనికొచ్చే గొడ్డలిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. కేవలం అధికారం, కుర్చీ కోసం సొంత మనుషులను కూడా బలితీసుకోవడానికి జగన్ వెనుకాడరని మంత్రి సవిత ఆరోపించారు.

మంత్రి సవిత భావోద్వేగ వ్యాఖ్యలు

హత్యకు గురైన పెద్దదస్తగిరి కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి సవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. "జగన్ ఏం చెబితే ఆ అరాచకాలన్నీ చేశాం.. కానీ చివరికి నా భర్త శవాన్ని గిఫ్ట్‌గా పంపారు" అని పెద్దదస్తగిరి భార్య ఆవేదన చెందుతుంటే చూడటం బాధాకరమని పేర్కొన్నారు. నమ్మిన వారిని వాడుకుని వదిలేయడం జగన్ నైజమని, ఆ కుటుంబం పడుతున్న బాధకు జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శవాల మీద రాజకీయాలు చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి సవిత విమర్శించారు.

ఇకనైనా మానుకోండి..

ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం మానుకోవాలని మంత్రి సవిత హెచ్చరించారు. పెద్దదస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు. బాధితులను పరామర్శించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా వినాశకర ఆలోచనలు పక్కనపెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story