జగన్ అరెస్ట్ అంటూ వార్తలు... మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్.. !

by velandi.Saikiran |

జగన్ మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. లిక్కర్

జగన్ అరెస్ట్ అంటూ వార్తలు... మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్.. !
X

దిశ, వెబ్ డెస్క్: జగన్ మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని జగన్ అనుకుంటున్నాడు అని సెటైర్లు పేల్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజా ప్రతినిధులకు చట్టం ఏం చుట్టం కాదని పేర్కొన్నారు. తాను లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతాడేమో అని భయపడి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

మహిళలను దూషించిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లడం ఏంటి? అని నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. చంద్రబాబును ఇదే జగన్ అకారణంగా 52 రోజుల పాటు జైల్లో పెట్టారని నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కాం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. లిక్కర్ కేసు చట్టం ప్రకారమే విచారణ జరుగుతోందన్నారు.

Next Story