- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో ఆటవిక పాలన అంతమొందింది: మంత్రి సత్యకుమార్
మతాల మధ్య విద్వేషాలు పెంచి అక్రమ చొరబాటులకి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి బెంగాల్ పేదలకి మట్టి కొట్టిన ఆటవిక పాలన అంతమొందిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: మతాల మధ్య విద్వేషాలు పెంచి అక్రమ చొరబాటులకి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి బెంగాల్(Bengal) పేదలకి మట్టి కొట్టిన ఆటవిక పాలన అంతమొందిందని మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(Bjp) అత్యధిక సీట్లు సాధించి విజయం వైపు దూసుకెళ్లడంపై ఆయన స్పందించారు. ప్రాంతాలు అభివృద్ధి ప్రజలకి మౌలిక సదుపాయలు, సంపద సృష్టి కారణంగానే మోదీని బెంగాల్ ప్రజలు ఆశీర్వదించారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఒక్కసారి గెలిచిన అనంతరం రెండో సారి గెలవడం అనేది అసంభవంగా ఉండేవాటిని పఠాపంచెలు చేస్తూ వరుస పాలనకి NDA కూటమి నాంది పలుకుతుందన్నారు. చాలా రాష్ట్రాల్లో NDA కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ వస్తోందని తెలిపారు. అక్రమ చొరబాటులని గుర్తించి వారి వారి దేశాలకి పంపించటం జరుగుతుందని చెప్పారు. డిటెక్ట్, డిలిట్, డిపోర్ట్ నినాదంతో బీజేపీ రాష్ట్రాలని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఏ ప్రాంత ప్రజలకి అన్యాయం చేయకుండా సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో అభివృద్ధి చేయటం మోదీ నిదర్శనమన్నారు. బీజేపీ సిద్ధాంతలపట్ల ప్రజలకి విశ్వాసం ఉందన్నారు. అస్సాంలోనూ బీజేపీ విజయ దుందుభి మోగించిందని సత్యకుమార్ పేర్కొన్నారు.






