ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఇంటి వద్దనే 41 వైద్య ప‌రీక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-03 14:34:27  IST  )

కూట‌మి పాల‌న‌లో న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల్లో భారీ పురోగ‌తి నమోదు అయిందని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌ అన్నారు...

ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఇంటి వద్దనే 41 వైద్య ప‌రీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: కూట‌మి పాల‌న‌లో న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల్లో భారీ పురోగ‌తి నమోదు అయిందని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌(Minister Satyakumar Yadav) అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ‌ల(Ntr Health Service) అమ‌లును, 108, 104 సేవ‌ల‌ను వ‌ర్చువ‌ల్‌గా సంబంధిత అధికారుల‌తో ఆయన స‌మీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వ్యయం 60 శాతం పెరిగిందన్నారు. ల‌బ్దిదారులు 21 శాతం పెరిగారని చెప్పారు. నిర్దేశిత స‌మ‌యంలో రోగుల వ‌ద్దకు 108 వాహ‌నాలుచేరుకుంటున్నాయన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 95 శాతం రోగుల‌ను 108 అంబులెన్సులు గంట‌లో ఆసుప‌త్రుల‌కు చేరుస్తున్నాయని పేర్కొన్నారు. 104 వాహ‌నాల ద్వారా త్వర‌లో ఇంటి వ‌ద్దనే 41 వైద్య ప‌రీక్షలు అందించనున్నట్లు తెలిపారు. 108 సేవ‌ల‌కు సంబంధించిన టెండ‌ర్‌లో కూట‌మి ప్రభుత్వం గ‌తానికి భిన్నంగా క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు విధించ‌డంతో ఈ సేవ‌లు ఎంతో మెరుగుప‌డ్డాయ‌ని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Next Story