బిహార్, జమ్మూ కశ్మీర్ మాదిరిగా ఏపీకీ కోరా: మంత్రి సత్యకుమార్ యాదవ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-24 09:21:56  IST  )

బిహార్, జమ్మూ కశ్మీర్‌లో మాదిరిగా మరో ఎయిమ్స్‌ను ఏపీకి మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

బిహార్, జమ్మూ కశ్మీర్ మాదిరిగా ఏపీకీ కోరా: మంత్రి సత్యకుమార్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్(Bihar), జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లో మాదిరిగా మరో ఎయిమ్స్‌(Aims)ను ఏపీ(Ap)కి మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారని మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satykumar Yadav) అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో శనివారం నాడు జరిగిన 8వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వెనుబడిన రాష్ట్రాలైనందున బిహార్, జమ్మూ కశ్మీర్‌‌కు మరో ఎయిమ్స్‌ను కేటాయించామని, మరో ప్రత్యేక పథకం కింద ఏపీకి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ‘‘పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నడపడం అందరికీ ఆమోదయోగ్యం. దురుద్దేశంతో దీనిపై విషప్రచారం చేస్తున్నారు. దీన్ని విద్యార్థులు గమనించాలి. సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలవల్ల గడచిన 19 నెలల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ, ఐపీ, ల్యాబ్ టెస్టులు పెరిగాయి. జీవితంలో వినోదం భాగమే కానీ, వినోదమే జీవితం కాదని విద్యార్థులు తెలుసుకోవాలి. ఎయిమ్స్‌కు ఇవ్వాల్సిన 10 ఎకరాలను త్వరలోనే కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వం ఎయిమ్స్‌కు కనీస నీటి సదుపాయాన్ని కల్పించలేకపోయింది.’’ అని సత్యకుమార్ కుమార్ విమర్శించారు.

Next Story