Minister Satyakumar: ఆంధ్రుల చరిత్రలో ఆయన ఆధునిక యుగ వైతాళికుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-01 09:34:44  IST  )

ఆంధ్రుల చరిత్రలో ఆధునిక యుగ వైతాళికుడు సీఎం చంద్ర‌బాబు అని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు..

Minister Satyakumar: ఆంధ్రుల చరిత్రలో ఆయన ఆధునిక యుగ వైతాళికుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రుల చరిత్రలో ఆధునిక యుగ వైతాళికుడు సీఎం చంద్ర‌బాబు(Cm Chandrababu) అని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్(Minister Satyakumar Yadav) అన్నారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన స్పందించారు. 30 ఏళ్లలో 15 ఏళ్ల‌ పాటు సీఎంగా, మరో 15 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజనాంతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడిగా స‌మ‌ర్ధ‌వంతంగా చంద్ర‌బాబు ప‌ని చేశారని గుర్తు చేశారు. తెలుగుజాతి వికాసానికి చంద్ర‌బాబు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రతిష్టింప చేస్తే... చంద్రబాబు తెలుగుజాతి ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేశారని సత్యకుమార్ చెప్పారు.

తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలుగు యువతను చంద్రబాబు నాయుడు ఆధునిక సాంకేతిక విజ్ఞాన దిశగా న‌డిపించారని సత్యకుమార్ తెలిపారు. పాలనా రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక విజ్ఞాన వినియోగాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారని సత్యకుమార్ తెలిపారు. పలు రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజోపయోగం కోసం పెను మార్పులకు బాటలు వేసిన ధీశాలి చంద్రబాబు అని ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నడుమ ఉన్న అవినావభావ సంబంధాన్ని గుర్తించి పాల‌న‌కు స‌రికొత్త నిర్వ‌చ‌మిచ్చిన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు.

Next Story