- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో రూ. వంద కోట్లతో 5 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు: మంత్రి సత్యకుమార్ యాదవ్
నాసిరకం ఆహర పదార్థాల వాడకం, విక్రయాల నిరోధానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు....

దిశ, వెబ్ డెస్క్: ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనల ప్రకారం నాసిరకం ఆహర పదార్థాల వాడకం, విక్రయాల నిరోధానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satykumar Yadav) వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు పార్ధసారధి ఆహార పదార్థాలతయారీలో కల్తీ గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
కల్తీపై కఠిన చర్యలు
తనిఖీల సమయంలో ఆహార పదార్థాల తయారీలో కల్తీకి పాల్పడిన వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులను నమోదు చేస్తున్నామన్నారు. శాఖాపరంగా ఆహార కల్తీల గుర్తింపునకు నిఘా పెంచామని తెలిపారు. 2025-26లో జనవరి వరకు 4,303 సాంపిల్స్ సేకరించి 233 కేసులను ఇప్పటివరకు నమోదు చేశామని చెప్పారు. Rs.31.80 లక్షలను పెనాలిటీ కింద రెస్టారెంట్స్, హోటళ్ల నుంచి వసూలు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
కొన్ని కేసుల్లో...
కొన్ని కేసుల్లో వాడిన నూనెను మళ్ళీ ఉపయోగిస్తున్నారని గుర్తించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఈ నెల తొలి వారంలో ఒంగోలు, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాల్లో తనిఖీలు జరిగాయని తెలిపారు. మొత్తం 56 రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి 59 ఆహార పదార్ధాల నమూనాలు సేకరించి, 13 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 385 కేజీల ఆహార పదార్థాల తయారీకి వినియోగించే వస్తువులను సీజ్ చేసినట్లు వివరించారు. ఆహార పదార్థాల తయారీ నమూనాలు పరీక్షించినప్పుడు 'అన్సేప్' అని రుజువు జరిగితేనే ఆరునెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఇందులో ఉన్న లొసుగుల ఆధారంగా పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఆహారంలో సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తున్నారని, నీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంపై అవగాహన కల్పిస్తూనే శాఖాపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
తిరుపతి, గుంటూరు, తిరుమల, మరో రెండు చోట్ల ల్యాబ్స్ ఏర్పాటు
“2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాదులోని ఇన్స్టిట్యూటు అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) విభజన 2022లో జరిగింది. దీనికితోడు 579 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు 150 నియామకాలు చేపట్టేందుకు ఆమోదం తెలుపగా తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. ఐపీఎం ప్రధాన కార్యాలయంలో మంజూరైన 279కు 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆథారిటీ అఫ్ ఇండియా సహకారంతో రూ. వంద కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 5 ల్యాబులు సిద్ధమవుతున్నాయి. విశాఖలో ఇప్పటికే ఒక ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. రెండు, మూడు నెలల్లో ఈ ల్యాబ్‌లో పరీక్షలు ప్రారంభమవుతాయి. తిరుపతిలోని ల్యాబ్ కూడా సిద్ధమవుతోంది. కర్నూలులోని కొత్త ల్యాబ్ను నోటిపై చేయాల్సి ఉంది. తిరుమలలో ప్రత్యేకంగా స్టేటు ల్యాబ్ సిద్ధమవుతోంది. అత్యాదునిక పరికరాలను ఇక్కడ సమకూరుస్తున్నాం. గుంటూరులోని ల్యాబ్ కూడా సిద్దం అవుతోంది.’’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు.






