- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం సిద్ధంగా ఉన్నాం.. జగన్‌ది ద్వంద్వ వైఖరి: మంత్రి సత్యకుమార్ యాదవ్
భోగాపురం విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram)లో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం(International Greenfield Airport)లో ఢిల్లీ(Delhi) నుంచి వచ్చిన టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దీంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఎకానమిక్ జోన్ అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రధాని మోడీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో భోగాపురం ఎయిర్ పోర్టులో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఎకానమిక్ జోన్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టును జూన్ 26న ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు అనవసరమని, ఎర్రబస్సు కూడా రాదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారని మంత్రి గుర్తు చేశారు. మళ్లీ తామే అవసరమైన అనుమతులు తెచ్చామని, కోర్టు కోసులు పరిష్కరించామని జగన్ చెప్పుకొస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు






