రాష్ట్రంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు: మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు...

రాష్ట్రంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు: మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెరుగుతున్న గుండెపోటు(heart attack) మరణాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 33 శాతం మేర గుండెపోటు మరణాలు నమోదు కాగా, ఏపీ(Ap)లో 32 శాతం గుండెపోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. కెనడాలో అత్యధికంగా 35 శాతం మేర గుండె పోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయని, గుండెపోటు మరణాల్ని ఛాలెంజ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రివెంటివ్ కార్డియాలజీ పై దృష్టి సారించాలని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

‘‘ప్రభుత్వాసుపత్రుల్లో గుండె చికిత్స కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాo. ఒంగోలులో ఇటీవలే క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించా. గుంటూరు జీజీహెచ్‌లో 110 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 3 హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం అభినందనీయం. సమాజంలో డిసీజ్ బర్డెన్ పెరుగుతున్నందున డాక్టర్లల్లో సేవాభావం పెరగాలి. యువతలో మానసిక వికాసానికి డాక్టర్లు ప్రధాన భూమిక పోషించాలి. వైద్యారోగ్యశాఖ చేపట్టిన ఎన్సీడీ 3.O సర్వే 70 శాతం పూర్తయ్యింది. 4.5 కోట్ల మందికి ఎన్సీడీ 3.O సర్వేలో 45 లక్షలమందికి మధుమేహం, 30 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 80 శాతం డిసీజ్ బర్డెన్ ఎన్సీడీ వల్లే ఉంటోంది. ఎన్సీడీ సర్వేలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా బయటపడుతున్నాయి’’. అని సత్యకుమార్ తెలిపారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో లివర్ సంబంధిత కేసులు పెరగడానికి గత ప్రభుత్వ లిక్కరే కారణం. ప్రజారోగ్యంపై అప్పటి లిక్కర్ బ్రాండ్లు ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించాయో అర్థం చేసుకోవచ్చు. 2020లో 3400 మంది శ్యాంపిళ్లు పరీక్ష చేయగా 24 శాతం మధుమేం, 28 శాతం హైపర్ టెన్షన్ (బీపీ) కేసులున్నట్లు తెలిసింది. నేడు మధుమేహం, బీపీ బాధితులు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలే కారణం,. గోదావరి జిల్లాల్లో మధుమేహం బాధితులు, రాయలసీమ జిల్లాల్లో బీపీ బాధితులు పెరుగుతున్నారు సి ఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 10 ప్రధాన వ్యాధులపై దృష్టి పెట్టాం. ప్రస్తుతమున్న 71 శాతం లైఫ్ ఎక్స్ పెన్టెన్సీని 85 శాతానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రం లో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కింది స్థాయి నుండి మ్యాపింగ్ చేస్తున్నాం. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వాసుపత్రుల్లో 8 శాతం మేర ఓపీ, 17 శాతం ఐపీ సేవలు పెరగడం ప్రశంసనీయం’’. అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Next Story