మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-02 11:28:37  IST  )

కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు...

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ(Kurnool Government Medical College)లో ర్యాగింగ్ కలకలం రేగింది. వినాయక చవితి(Ganesha Chavithi)కి చందాలివ్వాలని జూనియర్ మెడికల్ స్టూడెంట్స్‌ని సీనియర్స్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో జూనియర్స్‌ను సీనియర్స్ ర్యాగింగ్ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టి పెట్టారు. ప్రిన్సిపాల్ చిట్టి నర్సమ్మతో ఫోన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదికను అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నర్సమ్మను ఆదేశించారు. .

కాగా వినాయక చవితికి చందాలివ్వాలని జూనియర్ మెడికల్ స్టూడెంట్స్‌ని డిమాండ్ చేశారని, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ డాక్టర్ చిట్టి నర్సమ్మకు ఇప్పటికే జూనియర్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వార్డెన్‌ను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చయ్యలుంటాయని ప్రిన్సిపాల్ హెచ్చరించారు. ఇక కాలేజీలో జరిగిన ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ రంగంలోకి దిగిందని, ఇప్పటికే విచారణ చేపట్టిందని, త్వరలోనే ఆరోగ్య మంత్రికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

Next Story