- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్య వ్యవస్థపై రూ.6,500 కోట్ల అప్పు..మాజీ సీఎం జగన్‌పై మంత్రి ఫైర్
గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ ఆరోగ్య వ్యవస్థను సైతం భ్రష్ఠు పట్టించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ ఆరోగ్య వ్యవస్థను సైతం భ్రష్ఠు పట్టించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. మిగితా వ్యవస్థల మాదిరిగానే ఆరోగ్య వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజలు కూడా చూశారని, దానికి అనుగుణంగానే తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను మాత్రమే వారసత్వంగా తీసుకోవడం కాకుండా ఆరోగ్య వ్యవస్థ మీద కూడా దాదాపు రూ.6,500 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.2,500 కోట్లు, మందుల సరఫరాకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1వెయ్యి కోట్లు, కాలేజీల నిర్మాణంలో 700 కోట్లు, నాడు నేడు కింద రూ.400 కోట్ల అప్పులు మిగిల్చారని అన్నారు.
వచ్చిన ఏడాదిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, హెచ్ఆర్ సిబ్బంది నియామకంతో కాస్త మార్పు తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్‌లో నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పారు. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాలు విజయవంతం అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేసిందని చెప్పారు. ఆరోగ్యశాఖలో ఏడాదిలోనే ఇలాంటి మార్పు తీసుకువచ్చామని అన్నారు. ఆరోగ్యశాఖను పూర్తిగా గాడినపెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.






