- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేశ్‌కు అభినందనల వెల్లువ
టీడీపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రి అనగాని సత్యప్రసాద్ మనస్పూర్వక అభినందనలు తెలిపారు. నారా లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉరకలెత్తే యువ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు...

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రి అనగాని సత్యప్రసాద్ మనస్పూర్వక అభినందనలు తెలిపారు. నారా లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉరకలెత్తే యువ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తాత ఎన్టీఆర్ ఆశయాలను, తండ్రి చంద్రబాబు విజనరీని పునికి పుచ్చుకున్న లోకేశ్ దేశంలోనే అత్యుత్తమ పార్టీగా టీడీపీని నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ల అనుభవాలు, యువకుల వేగం కలయికతో నారా లోకేశ్ నాయకత్వంలో టీడీపీ అజేయంగా సాగుతుందని మంత్రి అనగాని తెలిపారు. మండల, క్లస్టర్ స్థాయి నేతలను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న చరిత్ర టిడిపిది మాత్రమేనన్నారు. కొత్త కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం చంద్రబాబు, లోకేశ్ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.






