దుష్ప్రచారం ఆపండి: జగన్‌కు మంత్రి సత్యకుమార్ లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-13 10:26:00  IST  )

మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండని వైఎస్ జగన్‌కు మంత్రి సత్య కుమార్ లేఖ రాశారు...

దుష్ప్రచారం ఆపండి: జగన్‌కు మంత్రి సత్యకుమార్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నిర్మాణమవుతోన్న మెడికల్ కాలేజీల(Medical Colleges)పై దుష్ప్రచారం ఆపాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌(Minister Satyakumar) సూచించారు. ఈ మేరకు లేఖ రాశారు. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని తమరు చెబుతున్న మాటలు అబద్ధమని లేఖలో పేర్కొన్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌లా తాము విఫలం కాకూడదనే పీపీపీని ఎంచుకున్నామని చెప్పారు. పీపీపీ, ప్రైవేటీకరణకు తేడా ఉందని తెలిపారు. తన లేఖపై స్పందించాలని జగన్‌ను మంత్రి సత్యకుమార్ కోరారు.

Next Story