- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. 9 డిమాండ్లు పరిష్కరించిన ప్రభుత్వం
పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు జీతాలు పెంచామని గుర్తు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అంగన్ వాడీల 9 డిమాండ్లను సైతం నెరవేర్చింది. మొత్తం 10 డిమాండ్లలో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఈ డిమాండ్‌ను కూడా త్వరలోనే తీర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగన్ వాడీల డిమాండ్లపై ఆమె మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు జీతాలు పెంచామని గుర్తు చేశారు. అంగన్ వాడీ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించాలని అంగన్ వాడీలు 40 రోజులు ధర్నా చేస్తే కనీసం స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్ వాడీ సిబ్బంది పది డిమాండ్ల చేసిందని, అందులో 9 నెరవేర్చామని తెలిపారు. మరో డిమాండ్‌పై సమగ్ర పరిశీలన చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.






