వాట్సప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం: మంత్రి సంధ్యారాణి సీరియస్

by Vemula.Srinu Prasad |

వాట్సప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి సీరియస్ అయ్యారు..

వాట్సప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం: మంత్రి సంధ్యారాణి సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummidi Sandhyarani) కుమారుడు, పీఏపై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam district) ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టి ఎస్పీ.. యువతి చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చారు. అయినా సరే కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి కుటుంబపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక వాట్సప్ గ్రూపుల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

దీంతో మంత్రి సంధ్యారాణి సీరియస్ అయ్యారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యుతిని ప్రోద్బలం చేయడంతోనే తన కుటుంబంపై యువతి ఆరోపణలు చేసిందని తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైమ్‌కు అప్పగించామని తెలిపారు. అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు ఒక్కొక్కరి పని చెబుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. తనను, తన కుమారుడిని చాలా బాధపెట్టారని, ఎవరిని విడిచి పెట్టమని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story