నా బిడ్డల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను: మంత్రి సంధ్యారాణి స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తన బిడ్డల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టనని మంత్రి సంధ్యారాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

నా బిడ్డల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను: మంత్రి సంధ్యారాణి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీశ్ రాజీనామా చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు అయింది. అయితే మంత్రి కుమారుడు పృధ్వీపైనా ఆరోపణలు చెలరేగాయి. దీంతో పృథ్వీని, పీఏ సతీశ్‌ను కాపాడేందుకు మంత్రి గుమ్మడి సుధారాణి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ప్రచారంలోకి ఆమె బిడ్డలను సైతం లాగి విమర్శలు కురిపిస్తున్నారు.

దీంతో మంత్రి సుధారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తన పీఏ సతీశ్ వ్యవహారంలో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చిన వెంటనే తన పీఏను ఉద్యోగం నుంచి తొలగించానని తెలిపారు. విచారణలో తన జోక్యం ఉండదని పోలీసులకు చెప్పానని ఆమె చెప్పారు. తనపై ఎలాంటి ఆరోపణలు చేసినా భరిస్తానని, కానీ తన బిడ్డలపై ఆరోపణలు చేస్తే సహించనని మంత్రి గుమ్మడి సుధారాణి హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. పోలీసుల విచారణ జరుగుతోందని, ఆ తర్వాత అన్నింటికి సమాధానం ఇస్తానని మంత్రి గుమ్మడి సుధారాణి స్పష్టం చేశారు.

Next Story