- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేనా జగన్ దేశానికి ఇచ్చే గౌరవం ? : మంత్రి సంధ్యారాణి
ఒక రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేసే తీరిక కూడా లేకపోయిందని ఏపీ మంత్రి సంధ్యారాణి విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒక రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేసే తీరిక కూడా లేకపోయిందని ఏపీ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. దేశానికి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. స్త్రీ శక్తిపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని ఖండించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్పిస్తున్న ఉచితబస్సు ప్రయాణంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. ఆస్తి కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన జగన్ తీరు ఏంటో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు.
స్త్రీ శక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపుమంటగా ఉందని దుయ్యబట్టారు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ రాష్ట్రంలో ఏ మహిళకు స్త్రీ శక్తి అందడంలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇలాగే ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కితే ఈసారి ఆ 11 సీట్లు కూడా మిగలవన్నారు. అలాగే మాజీ మంత్రి రోజా కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.






