- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాగే ఉంటే అవి కూడా మిగలవ్: మంత్రి వ్యంగ్యాస్త్రం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సంధ్యారాణి వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీ రాజధానిపై వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్, విజయవాడ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Jagan Mohan Reddy)పై మంత్రి సంధ్యారాణి(Minister Sandyarani) వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీ రాజధాని(Ap Captial)పై వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) ప్రతిపాదించిన మావిగన్(Mavigan), విజయవాడ(Vijayawada) వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను మనుషుల జాబితాలో చేర్చలేమని సెటైర్లు వేశారు. జగన్ వ్యవహార శైలితో వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని జగన్‌కు సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana), ధర్మాన ప్రసాదరావు(DharmanaPrasadarao) ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.
11 సీట్లకు పరిమితం చేసినా...
2024 ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని విమర్శించారు. గతంలో విశాఖ రాజధాని అన్ని జగన్ చెప్పినా ప్రజలు నమ్మలేదని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఇలాగే ఉంటే ఆ 11 సీట్లు కూడా మిగలవని హెచ్చరించారు. జగన్ ఎప్పికైనాకైనా సరే నిలకలేని వ్యక్తి అని అమరావతి(Amaravati)లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు.






