- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు కలిసినా వేస్టే: మంత్రి రోజా
by GSrikanth |
తిరుపతిలో నిర్వహించిన భోగి సంబురాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో కొన్ని పాత వస్తువులు కాల్చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో నిర్వహించిన భోగి సంబురాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో కొన్ని పాత వస్తువులు కాల్చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు కలిసినా.. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్లే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీల కోసం పవన్ కల్యాణ్ పార్టీలు మార్చుతాడని ఎద్దేవా చేశారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఫ్యాన్స్‌ను వాడుకుంటున్నారని.. జనసేన కార్యకర్తలను కూలీలుగా మార్చారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జగనే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇళ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఘనంగా జరుపుకుంటున్నారు.
Next Story






