ముష్టి 24 సీట్లకే ఎందుకు తలవంచావ్.. పవన్?

by srinivas |
ముష్టి 24 సీట్లకే ఎందుకు తలవంచావ్.. పవన్?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల వేళ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మొత్తం 118 సీట్లను అభ్యర్థులను ఖరారు చేశారు. 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 మంది టీడీపీ అభ్యర్థులు కాగా ఐదుగురు జనసేన అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. అయితే తక్కువ సీట్లు జనసేన కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు కురిపించారు. ముష్టి 24 సీట్ల కోసం పవన్ ఎందుకు తలవంచావ్ అని ఆమె ప్రశ్నించారు.


కుక్కకు బిస్కెట్లు వేసినట్లు 24 సీట్లు ఇస్తే తోక ఊపుకుంటూ ఎందుకు వెళ్లారని రోజా నిలదీశారు.సీఎంజగన్‌ను ఓడించలేమని, అంత బలంలేదని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు, సినిమాల్లో పవన్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవన్ లేని స్టార్‌గా ఉన్న పవన్‌కు అర్ధమైపోయిందని సెటైర్లు వేశారు. ఎలాగైనా జగన్‌ను అధికారం నుంచి దించాలనే ఆలోచనతోనే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ స్థానం ఖరారు అయిందని, కానీ పవన్ కల్యాణ స్థానం మాత్రం ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్ణయించే వరకు పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి రోజా విమర్శించారు.

Read More..

సీటు దక్కలేదని కంటతడి పెట్టుకున్న జనసేన ఇన్‌చార్జి.. సంచలన నిర్ణయం

Next Story

Most Viewed