- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఆరోపణలపై స్పందించిన మంత్రి.. విచారణకు సిద్ధమని సవాల్
నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై విద్యార్థుల ఆందోళనలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మేంద్ర ఘటనతో మంత్రి నారా లోకేశ్ రాజీనామాకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు బాధ్యత విద్యాశాఖ మంత్రి తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై విద్యార్థుల ఆందోళనలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మేంద్ర ఘటనతో మంత్రి నారా లోకేశ్ రాజీనామాకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు బాధ్యత విద్యాశాఖ మంత్రి తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మంత్రి లోకేశ్‌పై వైసీపీ నేతుల నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం తప్ప వైసీపీ నేతల దగ్గర ఆధారాలుండవని విమర్శించారు. తాడేపల్లి జగన్ ఇంటి సమీపంలోనే డీఎస్సీపై మంత్రి లోకేశ్ సవాల్ విసిరితే ఇప్పటివరకూ స్పందన లేదని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నియామకాలపై చట్టబద్ధమైన విచారణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.






