రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-02 10:02:39  IST  )

తమకు అభివృద్ధి రాజకీయాలే ముఖ్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ...

రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తమకు అభివృద్ధి రాజకీయాలే ముఖ్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల(Rayalaseema Projects)పై వైసీపీ(Ycp) నేతలు చేస్తు్న్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు రూ.6,613 కోట్లు కేటాయించారన్నారు. గాలేరు(Galeru), నగరి సుజల స్రవంతి(Nagari Sujala Sravanti)ని పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతి ఎకరాకు హంద్రీనీవా(Handrineeva) నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

హక్కుల పేరు చెప్పి..

రాయలసీమ హక్కుల పేరు చెప్పి వైఎస్సార్సీపీ నాయకులు పబ్బం గడుపుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని, 2014-19లో చంద్రబాబు నాయుడు రూ.12,441 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. హంద్రీనీవా ద్వారా 738 కి.మీ. దూరంలోని కుప్పానికి నీరు తరలించారని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.205 కోట్లు కేటాయించారని తెలిపారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story