- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణకాబోతోందని కొద్దిరోజులుగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రైవేటీకరణకాబోతోందని కొద్దిరోజులుగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు(RTC workers) ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. వీరికి మద్దతుగా నిరసనల్లో వైసీపీ నేతలు(YCP leaders) సైతం పాల్గొన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడారు.
త్వరలోనే 2500 ఈవీ, 500 సీఎన్జీ బస్సులు
ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ఆయన మాట్లాడతూ ఆర్టీసీని ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు. త్వరలోనే 2500 ఈవీ, 500 సీఎన్జీ బస్సులు రాబోతున్నాయని చెప్పారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచే ఆలోచనన లేదన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఆర్థికంగా బాగుందని తెలిపారు. రూ. 30 వేల కోట్ల ఆస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీలో చాలా సమస్యలు పరిష్కరించామని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం కూడా జరిగిందన్నారు. రెండేళ్లులుగా ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో అవసరమైన ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.






