- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పు అంశంపై నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పు అంశంపై నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను సీఎం వివరించారు. అలాగే రాయచోటి అభివృద్ధిని తానే ప్రత్యేకంగా చూసుకుంటానని, పట్టణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోనని సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి హామీ ఇచ్చారు. కాగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పటి వరకు ఉన్న రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తున్నట్టు సమాచారం.
మరోవైపు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైకి వెళ్లి ఆందోళన చేయడంతో రాకపోకలు రెండు గంటల పాటు పూర్తిగా స్తంభించాయి. జిల్లా కేంద్రం మార్పును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రాయచోటి మరియు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.






