- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి రాంప్రసాద్
అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెకు రాయచోటిని మార్పును కేబినెట్ ఆమోదించడంతో ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు చెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah District) నుంచి మదనపల్లె(Madanapalle)కు రాయచోటి(Rayachoti)ని మార్పును కేబినెట్(Cabinet) ఆమోదించింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం రాయచోటిని ప్రభుుత్వం మదనపల్లెకు మార్పు చేసిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి కొనసాగించాలని ప్రజలు కోరారని, కానీ మార్పు జరిగిందని, ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని ఆయన చెప్పారు. ఏడాదిలోపు రాయచోటిని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. పదవి పోతే తన కుటుంబానికి మాత్రమే నష్టం జరుతుందని తెలిపారు. రాయచోటి ప్రజల భవిష్యత్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని పేర్కొన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) జిల్లాలు చేసిన సమయంలో సమస్య పరిష్కరించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదన్నారు. రాయచోటిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు.






