- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నమయ్య జిల్లా కేంద్రంపై ఉత్కంఠకు తెర.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే గతంలో ఏర్పాటైన జిల్లాల కేంద్రాలపై పలు వివాదాలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే గతంలో ఏర్పాటైన జిల్లాల కేంద్రాలపై పలు వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో నెలకొన్న వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (Minister Ramprasad Reddy) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మాత్రమే ఉంటుందని, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై జరుగుతున్న చర్చ, ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ కూడా జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం, జిల్లా కేంద్రం మార్పుపై రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల ప్రజలు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి గురించి మంత్రి ఇలా మాట్లాడారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకోవడం, జిల్లా కేంద్రం తమ ప్రాంతంలో ఉండాలని కోరుకోవడం వారి ఆకాంక్ష అని, అందులో తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, జిల్లా కేంద్రం ఎక్కడ ఉందనే దానికంటే, మొత్తం జిల్లా ఎంత అభివృద్ధి చెందుతుంది అనే లక్ష్యం ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో నిర్ణయం ఖరారైందని, భవిష్యత్తులో అందరి దృష్టి ప్రాంతీయ అభివృద్ధిపైనే ఉండాలని మంత్రి పరోక్షంగా ప్రజలకు సందేశం అందించారు.






