- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడుదాం ఆంధ్రాపై విచారణ పూర్తి : మంత్రి రాంప్రసాద్
by Naga Rani Yarlagadda |
తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాపై విచారణ పూర్తయిందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరు తప్పు చేసినా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానానికి అందరూ సమానమేనని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్నారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్రీడా పరికరాల కొనుగోళ్లు మొదలు, క్రీడాకారులకు సరైన వసతి కల్పించేందుకు కేటాయించిన నిధుల్ని కూడా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సిద్ధం చేశారు.
Next Story






