Perni Nani: ఏపీలో మరో కొత్త జిల్లా.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-05 07:28:37  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా రానుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా

Perni Nani: ఏపీలో మరో కొత్త జిల్లా.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా రానుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు గిరిజన జిల్లాలు ఏర్పాటు చేశామని, అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం గిరిజన జిల్లాలేనని మంత్రి పేర్ని నాని తెలిపారు. మరో గిరిజన జిల్లా ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందని పేర్ని నాని స్పష్టం చేశారు. కాగా గతంలో 13 జిల్లాలు ఉండగా.. సోమవారం మరో కొత్త 13 జిల్లాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Next Story