మంత్రి పెద్దిరెడ్డి పెంపుడు కుక్క డిప్యూటీ సీఎం నారాయణ స్వామి: ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి

by Disha Web Desk 21 |
మంత్రి పెద్దిరెడ్డి పెంపుడు కుక్క డిప్యూటీ సీఎం నారాయణ స్వామి: ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అవినీతికి దత్తపుత్రుడు జగన్ రెడ్డి పంచన చేరి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పెంపుడు కుక్కలా పడి ఉండే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చంద్రబాబు కుటుంబంపై నోరెత్తే అర్హత లేదు అని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నారాయణ స్వామి పిచ్చి చేష్టలకు, పిచ్చి వాగుడుకి దళిత జాతి సిగ్గు పడుతోంది అని అన్నారు. పేరుకే డిప్యూటీ సీఎం పదవినిచ్చి అధికారం మొత్తం పెద్దిరెడ్డి చేతుల్లో పెట్టి చేవ చచ్చి చేతులు ముడుచుకున్న కూర్చున్న నువ్వు కూడా విమర్శించడం హేయమన్నారు. నీ లాంటి నీతిమాలిన, బుద్ది లేని వ్యక్తి వలన దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అని చెప్పుకొచ్చారు. కరోనా రావడానికి కారణం ముస్లీంలే అని ముస్లీం జాతిని అవమానించావు. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి సభల్లో కనీసం కుర్చీ మీద కూర్చునే ధైర్యం లేని నీ లాంటి వాళ్లు చంద్రబాబు కుటుంబ సభ్యులపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నువ్వు మంత్రివా? కంత్రివా? లేదా పెద్దిరెడ్డి బంట్రోతువా? అని దళిత సంఘాలు నిలదీస్తున్నాయన్నారు. కుటుంబ సభ్యులను వాడుకొని రాజకీయం చేసే నీచ చరిత్ర నీ జగన్ రెడ్డిదే అని తెలుసుకో? అని సూచించారు. జగన్ రెడ్డి 16 నెలల పాటు జైళ్లో ఉన్నప్పుడు చెల్లిని, తల్లిని వాడుకొని రాజకీయ లబ్ది పొందాడు? నేడు అదే తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటివేసింది జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. సొంత బాబాయ్‌ను చంపి, మరో చెల్లిని రోడ్డు పాలు చేసింది జగన్ రెడ్డి కాదా? కోడి కత్తి కేసును అడ్డంపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాక ముద్దాయిని ముప్పు తిప్పలు పెడుతుంది జగన్ రెడ్డి కాదా? అని నిలదీశారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించిన నీచ సంస్కృతి జగన్ రెడ్డిది కాదా? అని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు, ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడాలు, కుటుంబ సభ్యులను హత్యలు చేయించడాలు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు సేకరించడాలు వంటివి జగన్ రెడ్డికి తప్ప మరెవ్వరికి తెలియవు అని విమర్శించారు. మద్యం శాఖా మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నాశిరకం మద్యం పెంచి ప్రజల ప్రాణాలు హరించి మహిళల మంగల్యాలను తెంచే పనిలో నిమగ్నమయ్యారు. అసలు మద్య నిషేదం చేస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన మీరు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఎన్నికల్లోకి వెళతారు అని ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed