మా ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి: నిర్మలా సీతారామన్‌ను కోరిన పయ్యావుల

by Vemula.Srinu Prasad |

పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు....

మా ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి: నిర్మలా సీతారామన్‌ను కోరిన పయ్యావుల
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం-నల్లమలసాగర్(Polavaram-Nallamalasagar) లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌(Polavaram-Nallamalasagar)ను రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్(Polavaram-Nallamalasagar) కోరారు. ఢిల్లీలో ఆమెతో భేటీ అయిన ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ప్రతిపాదనలు సైతం ఆమెకు వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్క్ కు అత్యధిక స్థాయిలో రెవెన్యూ గ్రాంట్లూ విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. సాస్కీ, పూర్వోదయ పథకాల కిందనూ నిధులు ఇవ్వాలని కోరారు. విశాఖను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణం, నదులు అనుసంధానంతో పాటు రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.

Next Story