- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ విశాఖను నాశనం చేశాడు..మంత్రి ఫైర్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కాం జరగలేదని, కూటమి ప్రభుత్వంలో లిక్కర్ డోర్ డెలివరీ జరుగుతుందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కాం జరగలేదని, కూటమి ప్రభుత్వంలో లిక్కర్ డోర్ డెలివరీ జరుగుతుందని అన్నారు. కాగా జగన్ విమర్శలకు మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే జగన్ మాట్లాడుతున్నాడని అన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే ల్యాండ్, మైన్స్, వైన్ స్కాములు జరిగాయని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ఖర్చు మూడింతలు అయ్యిందని చెప్పారు. విశాఖను జగన్ నాశనం చేశాడని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను జగన్ తరిమేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలోనే రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయని మండిపడ్డారు.






