కష్టకాలంలో ప్రభుత్వం.. కలకలం రేపిన మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-31 13:20:50  IST  )

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కష్టకాలంలో ప్రభుత్వం.. కలకలం రేపిన మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక కష్టాలతో విభజిత ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh,) ప్రయాణం సాగించిన విషయం తెలిసిందే. గత పదేళ్లుగా కేంద్రం, లేదంటే అప్పులపై ఆధారపడి పాలన సాగింది. ఉద్యోగుల జీతాలు, కనీస ఖర్చులకు కూడా చేయి చాపి అడగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు మరింత క్లిషంగా మారిపోయాయి. రాష్ట్ర ఖనాజా పూర్తిగా అడుగంటిపోయింది. కనీస ఖర్చులకు డబ్బులు లేవు. దీంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. రూ. లక్ష కోట్లకు పైగానే వివిధ సంస్థలకు బకాయిలు చెల్లించాలని వెల్లడించారు. జీతాలు, వడ్డీలకే ప్రభుత్వం ఆదాయం సరిపోతోందన్నారు. గత ఐదేళ్లలో సంపద సృష్టిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Next Story