- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాంలో సంచలన వాస్తవాలు: ఎవర్నీ వదలమని మంత్రి హెచ్చరిక
లిక్కర్ కుంభకోణాల్లోవాస్తవాలు బయటకు వస్తున్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కుంభకోణాల్లో(Liquor Scams) వాస్తవాలు బయటకు వస్తున్నాయని, టీడీపీ(Tdp) కార్యకర్తలున్నా వదిలిపెట్టమని మంత్రి పార్థసారథి(Minister Parthasaradhi) తెలిపారు. కల్తీ మద్యం(Adulterated liquor) పేరిట వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అమ్మకాలు జరిపిన మద్యంలో హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ కూడా వచ్చిందని తెలిపారు. కానీ ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో దొరికిన మద్యంలో హానికర పదార్థాలు లేవు అని రిపోర్టు వచ్చిందని చెప్పారు. కల్తీ మద్యం వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టమన్నారు. కల్తీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ తీసుకొచ్చామని తెలిపారు. యాప్ ద్వారా హోలో గ్రామ్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. జగన్ హయాంలో స్కూటర్ల ద్వారా మద్యం హోం డెలివరీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులతో మద్యం అమ్మకాలు చేయించారని విమర్శించారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.






