అర్హులకే పెన్షన్లు: మంత్రి పార్థసారథి

by Vemula.Srinu Prasad |

అర్హులైన దివ్యాంగులకే పెన్షన్లు అందజేస్తామని మంత్రి పార్థసారథి అన్నారు...

అర్హులకే పెన్షన్లు: మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్ డెస్క్: దివ్యాంగుల(Disabled)కు ప్రభుత్వం పెన్షన్(Pention) కట్ చేస్తోందంటూ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు వైసీపీ(Ycp) నేతలు సైతం చేతులు కలిపారు. అనర్హత పేరుతో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేసిందంటూ పలువురు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి(Minister Parthasaradhi) స్పందించారు. పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో డబ్బులు తీసుకుని లబ్ధిదారులకు నకిలీ పెన్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నవాళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పార్థసారథి విమర్శించారు.

Next Story