ఆయనే మా ఆశా జ్యోతి: మంత్రి పార్థసారథి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-14 13:07:32  IST  )

తండ్రికి తగ్గ తనయుడు లోకేశ్ అని, ఆయనే తమ ఆశా జ్యోతి అని మంత్రి పార్థసారథి అన్నారు...

ఆయనే మా ఆశా జ్యోతి: మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్ డెస్క్: తండ్రికి తగ్గ తనయుడు లోకేశ్ అని, ఆయనే తమ ఆశా జ్యోతి అని మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) అన్నారు. యువగళం(Yuvagalam) పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంపైనా మంత్రి పార్థసారథి ప్రశంసలు కురిపించారు. విదేశాల్లోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే సేఫ్ అన్న నమ్మకం పారిశ్రామికవేత్తలదని చెప్పారు.

ఇక తల్లికి వందనంపై వైసీపీ(Ycp) నాయకులు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది రూ. 75 వేలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చింది రూ. లక్షా 5 వేలు అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి ప్రచారం చేసుకుందని, కానీ తాము 100కి 100 శాతం మెరుగైన సంక్షేమం అందిస్తున్నామన్నారు. డబ్బులు పంచడమే కాదని, సంక్షేమ పథకాలు పొందుతున్న వారి పిల్లల భవిష్యత్తుకు సైతం పునాది వేస్తున్నామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Next Story