ఇంట్లోనే సెట్ వేసి నటించడం అలవాటుగా మారింది: జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు

by Vemula.Srinu Prasad |

ఇంట్లోనే సెట్ వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అలవాటుగా మారిందని మంత్రి పార్థసారథి అన్నారు..

ఇంట్లోనే సెట్ వేసి నటించడం అలవాటుగా మారింది: జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లోనే సెట్ వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌(Ycp Chief Ys Jagan)కు అలవాటుగా మారిందని మంత్రి పార్థసారథి(Minister Parthasarathi) అన్నారు. తిరుమల(Tirumala) సెట్టింగ్ వేసి గతంలో జగన్ చేసిన పూజలను గుర్తు చేస్తూ ఆయన సెటైర్లు వేశారు. తిరుమలకు వెళ్లిన అబ్దుల్ కలాం(Abdul Kalam)కు డిక్లరేషన్ ఇచ్చారని, జగన్ మాత్రం ఎప్పుడూ చేయలేదని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో హిందువులను గౌరవించిన ధాఖలాలేవని ధ్వజమెత్తారు. పండగల సమయంలో ప్రజలు బాగుండాలని కోరుకోవాలని కానీ జగన్ ఒక్కడే సంతోషంగా ఉండాలని తత్వం వైసీపీలో ఉందన్నారు. ఓవైపు హిందూ ధర్మాన్ని భక్తిస్తూ మరోవైపు హిందూ ధర్మాన్ని రక్షించండని సూక్తులు చెప్పడం హాస్యాస్పదమని మంత్రి పార్థసారథి మండిపడ్డారు.

Next Story