- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరాచకాలను సృష్టించడమే వైసీపీ పని : మంత్రి పార్థసారథి
కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేసిన క్రెడిట్ చోరీ వ్యాఖ్యల్ని మంత్రి పార్థసారథి ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిని అడ్డుకోవడమే వైసీపీ ప్రధాన అజెండాగా పెట్టుకుందని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఆదివారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన శ్రీదేవకి యశోద శ్రీకృష్ణ ఆలయానికి మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు గుప్పించారు. అరాచకాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. క్రెడిట్ చోరీ అనే కొత్త నినాదంతో ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. నిజానికి వైసీపీ క్రెడిట్ 11 సీట్లైతే.. కూటమి ప్రభుత్వం క్రెడిట్ 164 సీట్లు అని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన పనులను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటి పనులు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా 2028 నాటికి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.






