- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అర్హత జగన్‌కు లేదు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్
పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) జల జీవన్ మిషన్ పథకం పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) జల జీవన్ మిషన్ పథకం పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి, పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అరాచకం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి, నిధులను పక్కదోవ మళ్ళించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారంటూ మంత్రి నిమ్మల ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అందినకాడికి అన్నిచోట్ల దోచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర జగన్‌ది అని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ వైసీపీ నేతల బృందం గవర్నర్‌కి ఇచ్చిన ఫిర్యాదు పత్రం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. నాడు వైసీపీ ప్రభుత్వం లో 90 శాతం హామీలు నెరవేర్చలేని జగన్, ఆ పార్టీ నాయకులకు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల రూపాయలను కూటమి ప్రభుత్వం అందజేయనుందని మంత్రి పేర్కొన్నారు.






