- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రంతా వెలిగొండ సొరంగంలోనే మంత్రి నిమ్మల..? చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ పరిశీలన
ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పుట్టినరోజును సైతం పక్కనపెట్టి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పుట్టినరోజును సైతం పక్కనపెట్టి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రంతా ఆయన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు సమీపంలో ఉన్న టన్నెల్-2 లోనే గడిపారు. సొరంగంలో సుమారు 19 కి.మీ. మేర ప్రయాణించిన మంత్రి.. 5 గ్యాంట్రీల్లో జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో కలిసి కార్మికుల యోగక్షేమాలు తెలుసుకుని, వారితో పాటే రాత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా టన్నెల్-2లో 12వ కి.మీ. వద్ద చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్‌ను ఆయన పరిశీలించారు.
రైతులను జగన్ మోసం చేశారు
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీబీఎం మెషిన్‌ను తొలగించే ప్రయత్నమే చేయలేదని, ఆ యంత్రాన్ని బయటకు తీయకపోతే టన్నెల్ నుంచి చుక్క నీరు కూడా రాదని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి గత ముఖ్యమంత్రి జగన్ రైతులను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. సొరంగంలో రాళ్లు రాలుతున్న దృష్ట్యా కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి, లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గూడూరి ఎరిక్షన్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






