- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వైసీపీ చేసేదంతా విష ప్రచారమే’.. తేల్చి చెప్పిన మంత్రి నిమ్మల
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. అందుకే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయా ఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కనీస అవగాహన లేకుండా, ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకుండా నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని, పోలవరం ప్రాజెక్టు ప్రగతి పనుల వేగం పై నీళ్లు చల్లాలి అనుకోవడం వైసీపీ అవివేకం, అజ్ఞానం అని మంత్రి దుయ్యబట్టారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం, పోలవరం పనుల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాత్రికేయుల సమక్షంలో డయా ఫ్రమ్ వాల్ ప్యానల్ మందం బావర్ కంపెనీ ప్రతినిధులతో కొలిపించామని తెలిపారు. ఈ క్రమంలో 1.5 మీటర్లు ఉండడాన్ని చూపించారు. 0.9 మీటర్లకు కుదించారు అన్న విష ప్రచారం తప్పని మంత్రి నిమ్మల నిరూపించారు. గతంలో కూడా పోలవరం డ్యాం ఎత్తు తగ్గించేస్తున్నారు అంటూ విష ప్రచారం చేసి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ముఖం చాటేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక అభివృద్ధి పనులపై వైసీపీ అనుక్షణం అడ్డు తగలడానికి ప్రయత్నిస్తోందన్నారు.
అనంతరం.. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం అన్నారు. ఈ తరుణంలో పూర్తి అయి తీరుతుందని నిమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతం పైగా పూర్తయ్యాయని ఆయన వివరించారు. ప్రాజెక్టు పనులలో ప్రపంచంలోనే పేరెన్నిక గన్న జర్మనీకి చెందిన బావర్ కంపెనీ తో "మేఘా" పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని మంత్రి నిమ్మల మండిపడ్డారు.






