- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : హలో.. అతను రైతు కాదు.. రాష్ట్ర మంత్రి
by Muthe.Rajitha |
ఏకంగా రాష్ట్రానికి మంత్రి అయి ఉండి కూడా ఓ సామాన్య రైతులా పొలం పనులు చేయడం విడ్డూరం కలిగించే విషయమే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏకంగా రాష్ట్రానికి మంత్రి అయి ఉండి కూడా ఓ సామాన్య రైతులా పొలం పనులు చేయడం విడ్డూరం కలిగించే విషయమే. ఏపీలోని పాలకొల్లు ఎమ్మెల్యే(Palakollu MLA), రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanayudu) ఓ సాధారణ రైతులా తన పొలానికి మందు పిచికారి చేస్తూ కనిపించారు. ఇదే విషయం ఆయనను అడగగా.. తనకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అని, లెక్చరర్ గా పని చేసిన రోజుల్లో ఎకరాకు 55 బస్తాల దిగుబడి తీశానని అన్నారు. పండగ సందర్భంగా తమ స్వగ్రామం వచ్చానని, ఇలా వచ్చినపుడు ఏవైనా పొలం పనులు ఉంటే తాను స్వయంగా చేస్తానని, ఈ పని చాలా తృప్తిని ఇస్తుందన్నారు. తాను తలచుకుంటే వంద మండి పని వాళ్ళను పెట్టి పొలం పనులు చేయించుకోగల స్థోమత ఉన్నప్పటికీ.. తానే బురదలోకి దిగి పొలం పనులు చేయడం ఆశ్చర్యం గొలిపే విషయం.
Next Story






