- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుడమేరుకు గండి.. అధికారులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు
గతేడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరు (Budameru)కు గండి పడటంతో విజయవాడను వరదలు (Vijayawada Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. కట్టుబట్టలతో లక్షలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరు (Budameru)కు గండి పడటంతో విజయవాడను వరదలు (Vijayawada Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. కట్టుబట్టలతో లక్షలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ వరదలను తలచుకుంటేనే ఇప్పటికీ సింగ్ నగర్ (Singh Nagar), పరిసర ప్రాంతాల వాసులు వణికిపోతారు. జీవితంలో మళ్లీ అలాంటి వరదలు రాకూడదని, అలాంటి ఉపద్రవాలను తట్టుకోలేమని చెప్తారు. కాగా.. గతేడాది భారీ వరదల కారణంగా బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) శుక్రవారం పర్యటించారు.
గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ వాల్ నిర్మాణ (CC Wall Construction) పనులను మంత్రి పరిశీలించారు. అత్యవసరంగా బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చగా.. వాటిని కలుపుతూ రూ.23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి నిమ్మల కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. పనులు నత్తనడకల సాగుతుండటంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఆయన నోటీసులు జారీ చేశారు. సీసీ వాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఇకపై మూడు షిఫ్టుల్లో పనిచేయాలని సదరు ఏజెన్సీని ఆదేశించారు.






