ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్... మంత్రి నిమ్మల కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 09:18:17  IST  )

ఉత్తరాంధ్ర ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ తెలిపారు..

ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్... మంత్రి నిమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandhra) ప్రజల క‘న్నీటి’ కష్టాలకు తెర పడేది ఎప్పుడు..?. వాన కాలంలోనూ మంచి నీళ్ల కోసం కిలో మీటర్ల మేర నడవాల్సిందే..?, జోరుగా వర్షం పడుతున్నా దాహర్తి తీరేప్పుడు...?, పోలవరం ద్వారా గోదావరి జలాలు అందిస్తామన్న హామీ కలగానే మిగులుతుందా..? అనే ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) సమాధానం చెప్పారు. పోలవరం పనులపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌(Polavaram diaphragm wall) నిర్మాణంపై చర్చించారు. అనంతరం నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం డయా ఫ్రమ్ వాల్ 40 శాతం పూర్తయ్యిందన్నారు. డిసెంబర్‌ నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తవుతుందని చెప్పారు. ఏడాది చివరికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Next Story