జగన్‌కు ఆ అర్హతే లేదు: మంత్రి నిమ్మల ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు....

జగన్‌కు ఆ అర్హతే లేదు: మంత్రి నిమ్మల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో పార్టీని నడిపే అర్హత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) విమర్శించారు. జగన్ పాదయాత్రపై ఆయన స్పందించారు. జగన్ పాదయాత్ర చేస్తోంది జనం కోసం కాదని, అధికారం కోసమని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి ఉన్న సమయంలో ఇసుక, మైనింగ్, లిక్కర్, భూ కబ్జాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అసత్యాలు ప్రచారం చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేప పధకాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్నా.. వైసీపీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చెబుతున్న అసత్యాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Next Story