- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం ఉన్న ప్రభుత్వం మాది.. ఖర్చుకు వెనుకాడేది లేదు: మంత్రి నిమ్మల
రాజమండ్రి కల్తీపాల ఘటనలో అస్వస్థతకు గురైన వారికి వైద్యం కొనసాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 15 మందికి వైద్యం కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం 11 మందికి వైద్యులు వెంటిలేటర్ పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు. బాధితుల వైద్యానికి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, బాధితుల కుటుంబ సభ్యులు కూడా వైద్యంపై సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని, ఖర్చెంతైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్ని రకాల పరీక్షలు చేయించినట్లు తెలిపారు. బాధితుల బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులు సాయంత్రంలోగా వస్తాయన్నారు.
పాల కల్తీకి కారణమైన కూలెంట్ లీక్ బాక్స్ ను సీజ్ చేసి పరీక్షలకు పంపినట్లు చెప్పారు. పాలను సరఫరా చేసే వ్యాపాలి ఇథలిన్ గ్లైకాన్ తక్కువ రేటుకే వస్తుందని కూలెంట్ కు వాడారని, దానివల్లే ఇదంతా జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు ఈరోజు వస్తాయని అంచనా వేస్తున్నామని, రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






