- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూ సమస్య.. మంత్రి నారాయణ కీలక రిక్వెస్ట్
సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందని మంత్రి నారాయణ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: సీడ్ యాక్సిస్ రోడ్డు(Seed Axis Road)ను మంగళగిరి రహదారి(Mangalagiri Road)కి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందని మంత్రి నారాయణ(Minister Narayana) అన్నారు. ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్(Buckingham Canal)పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజులు సమయం ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 9 నాటికి భూ సమీకరణకు 4.5 ఎకరాల రైతులు ముందుకు రావాలని లేనిపక్షంలో భూసేకరణ చేపడతామన్నారు. భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చామని తెలిపారు. బకింగ్ హాం కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నారని తెలిపారు. బకింగ్ హాం కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జ్‌లు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయని తెలిపారు. ఈ 2బ్రిడ్జ్ లు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని మంత్రి నారాయణ పేర్కొన్నారు.






