- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Narayana:‘నేను టెన్త్ ఫెయిల్ అయ్యా.. కసితో పీజీ చేశా’.. మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా పేరెంట్స్(Parents) ప్రోత్సహించాలని మంత్రి నారాయణ(Minister Narayana) సూచించారు.

దిశ,వెబ్‌డెస్క్: మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా పేరెంట్స్(Parents) ప్రోత్సహించాలని మంత్రి నారాయణ(Minister Narayana) సూచించారు. నేడు(శనివారం) నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో(High School) జరిగిన పేరెంట్స్& టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విద్యార్థి మేధావేనని, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పారు. నేను 1972లో టెన్త్ ఫెయిలయ్యా.. దీంతో నాలో కసి పెరిగింది. కష్టపడి చదివి డిగ్రీ(Degree), పీజీ(Post Graduate)లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా మారా’ అని గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థికి ఫౌండేషన్ విద్య(Foundation Education) చాలా అవసరమని తెలిపారు. మంత్రి లోకేష్(minister Nara Lokesh) విద్యాశాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రంలో 45094 పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్, టీచర్లతో సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలోని 2604 పాఠశాలల్లో ‘బడి పండుగ’ జరుపుతున్నట్లు మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.






