Minister Narayana: చెత్త పన్ను వేయడం తప్ప వాళ్లకు ఏం తెలుసు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by Shiva |
Minister Narayana: చెత్త పన్ను వేయడం తప్ప వాళ్లకు ఏం తెలుసు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలపై చెత్త పన్ను వేయడం తప్ప వైసీపీ (YCP) వాళ్లకు ఏం తెలుసని మంత్రి నారాయణ (Minister Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జీఎంసీ (GMC) పరిధిలోని జిందాల్ ప్రాజెక్టు (Jindal Project)ను పరిశీలించారు. అక్కడ ప్లాంట్ నిర్వహణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 6,890 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లుగా సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ (YCP Government) విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను చిన్నచూపు చూసిందని అన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ (TDP Government) హయాంలో వచ్చిన వేస్టేజీతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. త్వరలోనే కాకినాడ (Kakinada), నెల్లూరు (Nellore)లలో ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలపై చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా వాడుకోవాలో వైసీపీ (YCP) నాయకులకు తెలియకపోవడం వారి అమాయత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే కేబినెట్‌లో తీర్మానించి చెత్త పన్నును తొలగించామని మంత్రి నారాయణ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed