- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రూ.100 కోట్ల స్కాం: మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో రూ.100 కోట్ల స్కాం జరిగిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో టీడీఆర్ బ్రాండ్స్‌లో స్కాం జరిగిందని, దాదాపు రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తణుకులోనూ రూ. 700 కోట్ల అవకతవకలు జరిగాయని తెలిపారు. భూములో ఓ చోట ఉంటే వాటి డోర్ నెంబర్లు వేరే చోట ఉన్నాయన్నారు. ఐదేళ్లు పాలించిన జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రజలపై చెత్త పన్ను వేసి చెత్తను మాత్రం వదిలేసి వెళ్లారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇక తిరుపతిని మెగాసిటీగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. తిరుపతిలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ లకు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.






