- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖకు 'సెమీ రింగ్ రోడ్డు'.. మూడేళ్లలో మెట్రో పూర్తి: మంత్రి నారాయణ
విశాఖ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నగరానికి సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన పట్టణ గృహ నిర్మాణ శాఖ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల స్వయం సమృద్ధి, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
విశాఖ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సెమీ రింగ్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, దీనిపై ప్రస్తుతం వీఎంఆర్డీఏ (VMRDA) క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తోందని మంత్రి తెలిపారు. విశాఖ మెట్రోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఒకటి రెండు నెలల్లో తుది అనుమతులు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనుమతులు రాకముందే టెండర్ల ప్రక్రియను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.






